‘కింగ్‌డమ్’ సెన్సార్ పూర్తి

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వ‌స్తోన్న భారీ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌ ‘కింగ్‌డమ్’. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అధికారికంగా  ప్ర‌క‌టించారు. 

ఈ నెల‌ 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ‘కింగ్‌డమ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో రౌడీ బాయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుండగా, సత్యదేవ్ మ‌రో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మ‌రోవైపు, ఇవాళ తిరుపతిలో జర‌గ‌నున్న కింగ్‌డ‌మ్ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 

Kingdom Movie
Vijay Deverakonda
Gowtam Tinnanuri
Bhagyashri Borse
Satyadev
Anirudh Ravichander
Telugu movies
Tollywood news
Kingdom pre release event
Sithara Entertainments

More Telugu News